Andhra Pradesh: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్‌ విద్యార్థి ఎంపిక

Andhra Pradesh: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు విజ్ఞాన్‌ విద్యార్థి ఎంపిక
x
Highlights

వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన తృతీయ సంవత్సరం మెకానికల్‌ విభాగానికి చెందిన ఏ.దుర్గా యశ్వంతరెడ్డి న్యూఢిల్లీలో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికయ్యాడని యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.

చేబ్రోలు: వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన తృతీయ సంవత్సరం మెకానికల్‌ విభాగానికి చెందిన ఏ.దుర్గా యశ్వంతరెడ్డి న్యూఢిల్లీలో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికయ్యాడని యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ మాట్లాడుతూ.. 26న జరిగే రిపబ్లిక్‌ డే ప్రోగ్రాంలో యూనివర్సిటీ విద్యార్థి యశ్వంత్‌రెడ్డి ప్రధానమంత్రి ర్యాలీతో పాటు, ఫ్లాగ్‌ ఏరియా కాంపిటీషన్‌ అనే రెండు విభాగాలలో పాల్గొనడానికి ఎంపికవడం గర్వకారణమన్నారు.

అంతే కాకుండా ఎన్‌సీసీ విభాగంలో రాష్ట్ర స్థాయి బెస్ట్‌ క్యాడెట్‌ మెడల్‌ అందుకోవడంతో పాటు, న్యూఢిల్లీలో 12 రోజుల పాటు జరిగిన తల్‌ సైనిక్‌ శిక్షణా శిబిరానికి ఎంపికై అక్కడ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచాడన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్‌లర్‌ కే.రామ్మూర్తి నాయుడు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, రెక్టార్‌ డాక్టర్‌ కే.సత్యప్రసాద్, ఏఎన్‌ఓ శివకోటేశ్వరరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొని దుర్గా యశ్వంతరెడ్డిని అభినందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories