
అలిపిరి టోల్‌గేట్ వద్ద మద్యం, మాంసం కారులో తరలిస్తున్న ఘటన కలకలం రేపుతోంది.
అలిపిరి టోల్‌గేట్ వద్ద మద్యం, మాంసం కారులో తరలిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్నఓ వ్యక్తి తన కారులో 11 లీటర్ల మద్యం, ఐదు కిలోల చికెన్‌ను తిరుమల కొండపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.
అలిపిరి టోల్‌గేట్ బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో శ్రీ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి చెందిన శ్రీ ఎన్.వెంకటముని కారులో తిరుపతి నుండి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్‌గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. కోవిడ్-19నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత పదార్థాలను తిరుమలకుతీసుకెళుతుండడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
ముందు సీటు కింది భాగంలో నిషేధిత పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల మాసం , సిగ్నేచర్ విస్కీ 4 బాటిళ్లు, ఓట్కా -2 బాటిళ్లు, లూజ్ లిక్కర్ -2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, శ్రీ వెంకటమునిపై గతంలో నమోదైన ఒక కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




