జగన్ తెరిచిన డిజిటల్ బుక్ లో వైసీపీ బాధితుల మొర

జగన్ తెరిచిన డిజిటల్ బుక్ లో వైసీపీ బాధితుల మొర
x

జగన్ తెరిచిన డిజిటల్ బుక్ లో వైసీపీ బాధితుల మొర

Highlights

న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు తిప్పేస్వామికి డబ్బులు ఇచ్చాం.. తిరిగి ఇప్పించాలని.. డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ జగన్‌కి బాధితుల వేడుకోలు

మాజీ వైసీపీ ఎమ్మెల్యేతో అన్యాయం జరిగిందని.. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే దిక్కు అని డిజిటల్ బుక్‌లో జగన్‌ను కోరారు బాధితులు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్యాయం చేశాడని ఇద్దరు బాధితులు డిజిటల్ బుక్‌లో వివరించారు. డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు, బాధితులు మాట్లాడిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని.. మాజీ వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆశ చూపి 25 లక్షలు తీసుకుని పదవి ఇవ్వలేదని బాధితుడు వాపోయాడు‎. తిరిగి డబ్బులు ఇవ్వమని అడిగితే పార్టీకోసం ఖర్చుచేశానని.. ఎవరికైనా చెప్పుకో అని బెదిరించాడని బాధితుడు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని.. లేకపోతే మా కుటుంబానికి ఆత్మహత్యలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

మరో బాధితుడు ఆగలి మండలం దొక్కిలపల్లి గ్రామానికి చెందిన కామన్న. అంగన్వాడీలో హెల్పర్ ఉద్యోగం కోసం లంచంగా 75 వేల రూపాయలు తీసుకుని ఉద్యోగమిచ్చాడు. తర్వాత పదోన్నతి రావడంతో మళ్లీ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు తెలిపాడు. అన్యాయం జరిగిన తమలాంటి వారికి న్యాయం చేయాలని జగన్‌ను కోరారు..

Show Full Article
Print Article
Next Story
More Stories