సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కి వేటూరి పురస్కారం

సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కి వేటూరి పురస్కారం
x
రామ జోగయ్య శాస్త్రి (ఫైల్ ఫోటో)
Highlights

పాయకరావుపేట: తుని మరియు పాయకరావుపేట జంట నగరాల నందు వేటూరి సాహితీ పీఠం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని దశమ వసంతం లోకి అడుగిడుతున్న శుభవేళ వేటూరి...

పాయకరావుపేట: తుని మరియు పాయకరావుపేట జంట నగరాల నందు వేటూరి సాహితీ పీఠం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని దశమ వసంతం లోకి అడుగిడుతున్న శుభవేళ వేటూరి జన్మదినం సందర్భంగా సినీ, సాహితీ రంగ ప్రముఖులకు వేటూరి సాహితీ పీఠం ఇచ్చే దశమ వేటూరి పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రికి అందచేయనున్నట్లు వేటూరి సాహితీ పీఠం వ్యవస్థాపక కార్యదర్శి కలగ రామ జోగేశ్వర శర్మ తెలిపారు.

ఈ వేటూరి సాహితీ పీఠం శాశ్వత గౌరవ అధ్యక్షులుగా తనికెళ్ళ భరణి, వ్యవస్థాపక అధ్యక్షులుగా చక్కా సూర్యనారాయణ, అధ్యక్షులుగా సి.హెచ్.వి. కే. నరసింహారావు వ్యవహరిస్తున్నారు. ఈ పురస్కార కార్యక్రమం ప్రకాష్ ఎడ్యుకేషనల్ & కల్చరల్ అసోసియేషన్, వేటూరి సాహితీ పీఠం తుని మరియు పాయకరావుపేట వారి ఆధ్వర్యంలో జనవరి 29 న తుని పట్టణంలో 16వ జాతీయ రహదారి పక్కన గల చిట్టూరి మెట్రో నందు సాయంత్రం 5 గం. లకు ప్రారంభమవుతుందని శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సి.హెచ్. విజయ్ ప్రకాష్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories