నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

Verdict On Chandrababu Naidu Quash Petition In Supreme Court Today
x

నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు

Highlights

Chandrababu: ఇప్పటికే పూర్తయిన ఇరు పక్షాల వాదనలు

Chandrababu: అందరి కళ్లూ అటు వైపే. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది.. క్వాష్ పిటిషన్‌ కొట్టివేతకు గురవుతుందా.. చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా.. మేమే కరెక్ట్ అంటున్న సీఐడీ వాదనే గెలుస్తుందా.. ఇన్ని ప్రశ్నలూ జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసు ఇవాళ కీలక మలుపు తీసుకోబోతోంది. అటు…టీడీపీ- వైసీపీల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై ఫోకస్ పెరిగింది.

తనపై పెట్టిన కేసు చెల్లదు, కొట్టివేయండి అంటూ మాజీ సీఎం చంద్రబాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వచ్చే అవకాశముంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో 43 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడబోతోంది. హైకోర్టులో కొట్టేసిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ.. ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు. రేపటినుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు కనుక.. తీర్పు ఇవాళ వెలువరించకపోతే మరో పదిరోజులు ఆగాల్సిన పరిస్థితి.

స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17-ఏ. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అతడిని నియమించిన వ్యవస్థ అనుమతి తప్పనిసరి… అనేది ఈ సెక్షన్ సారాంశం. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాల్లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన.

ఏదేమైనా… క్వాష్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వస్తే… చంద్రబాబు కేసుల పరంపరలో కచ్చితంగా ఇదొక కీలక పరిణామమే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-Aకి సంబంధించిన ఈ తీర్పు…న్యాయవ్యవస్థలో ఒక బెంచ్‌మార్క్ కాబోతోంది. అందుకే.. చంద్రబాబుతో పాటు.. దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్నీ ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్‌గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. 9వ నెంబర్‌గా ఫైబర్ గ్రిడ్ కేసు లిస్టింగ్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories