బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్‌ కుమార్‌ అరాచకం

Vemuru SI Cruel Behavior On Minor Boy In Bapatla | AP News
x

బాపట్ల జిల్లా వేమూరు ఎస్సై అనిల్‌ కుమార్‌ అరాచకం

Highlights

Bapatla: యువకుడి తలపై కత్తితో కోసిన ఎస్సై అనిల్‌కుమార్‌

Bapatla: బాపట్ల జిల్లాలో అరాచకం చోటు చేసుకుంది. వేమూరు ఎస్సై అనిల్ కుమార్ మైనర్ బాలుడు షేక్ మొహ‍మ్మద్ రఫీ తలపై కత్తితో కోశాడు. తలపై కోయడంతో బాలుడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. మూడు రోజుల క్రితం కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీస్ స్టేషన్ పంచాయితీకి సెటిల్మెంట్‌కు రావడంతో స్టేషన్‌కు వచ్చిన రఫీని గదిలోకి తీసుకెళ్లి ఎస్సై అనిల్ చితకబాదాడు. అంతటితో ఆగకుండా ఎస్సై బాలుడి తలపై కత్తితో కోశాడు.

రక్తం కారుతున్నా బయటకు వెళ్లడం కుదరదని డాక్టర్‌ను తీసుకొచ్చి ఇక్కడే చికిత్స చేయిస్తానని ఎస్సై హుకుం జారీ చేశారని బాలుడు ఆరోపిస్తున్నాడు. సెటిల్మెంట్ అవుతుందని గ్రామంలో పెద్దలు చెబితేనే వేమూరు పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చామని బాలుడి తండ్రి మౌలాలి అంటున్నాడు. తప్పు చేస్తే, మందలించాలే తప్ప కత్తితో కోయటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories