చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్‌

చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ ఫైర్‌
x
Highlights

మధ్య నిషేధానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ మహిలా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.....

మధ్య నిషేధానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ మహిలా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. మద్యనిషేధం విషయంలో వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంటే.. మద్యనిషేధం తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని..

మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. 6 శాతం కంటే తక్కువ మరణాలు, 40 శాతం ప్రమాదాలు మద్యం సేవించడం వల్లనే జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఇది కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బిసి కి చెందిన కుటుంబాలను మద్యం చిచ్చుపెడుతోందని అన్నారు. మద్యపాన నిషేధం అమలు చేయడం రాష్ట్రాల నైతిక బాధ్యత. చదువుకునే పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దశలవారీగా మధ్య నిషేధం విధించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని.. దేనిని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం తగదని ఆమె అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories