టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. కీలకనేత రాజీనామా

టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. కీలకనేత రాజీనామా
x
Highlights

వలసలతో ఉక్కిరిబిక్కిరి తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వరుపుల రాజా టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు....

వలసలతో ఉక్కిరిబిక్కిరి తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వరుపుల రాజా టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఈ దఫా ఎన్నికలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ.. కష్టపడి పనిచేసే వారికి టీడీపీలో గుర్తింపు లేదని ఆరోపించారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రశంసించారు. కాగా గతఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసిన కొందరు నేతలు, నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories