ఎట్టకేలకు వర్ల రామయ్య రాజీనామా

ఎట్టకేలకు వర్ల రామయ్య రాజీనామా
x
Highlights

ఆర్టీసీ చైర్మన్‌ పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. శనివారం ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రామయ్య.

ఆర్టీసీ చైర్మన్‌ పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. శనివారం ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రామయ్య.. రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా నియమితులైన వర్ల రామయ్య ప్రభుత్వం మారి చాలా రోజులైనా పదవికి రాజీనామా చేయలేదు.. పైగా ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంది.. అయితే వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్‌ 24, 2019లో ముగిసినా రాజీనామా చేయలేదు.

దీంతో ఏపీఎస్‌ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్‌-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. ఇటీవల నోటీసులు అందుకున్న వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఐదునెలల తరువాత వర్ల రామయ్య తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories