రాధాతో టచ్ లో ఉన్న టీడీపీ నేతలు..

రాధాతో టచ్ లో ఉన్న టీడీపీ నేతలు..
x
Highlights

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఓ దఫా కార్యకర్తలతో చర్చించిన రాధా.. మరోసారి చర్చలు జరిపి ఏ...

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే ఓ దఫా కార్యకర్తలతో చర్చించిన రాధా.. మరోసారి చర్చలు జరిపి ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు టీడీపీకి చెందిన కీలక నేతలు రాధాతో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాధాను టీడీపీలోకి తీసుకురావాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీలోకి వస్తే తనకు సెంట్రల్ సీటు కావాలని రాధా ఖచ్చితంగా అడుగుతారు. అది కుదరకపోవచ్చు. ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. తనకే మళ్ళీ సీటు కావాలని ఆయన పట్టుబడుతున్నారు. అంతేకాకుండా టీడీపీలో వంగవీటి కుటుంబానికి బద్ద వ్యతిరేకి అయిన దేవినేని కుటుంభం ఉంది. ఈ క్రమంలో రాధా ఒకవేళ టీడీపీలో చేరితే పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది.

ఇదిలావుంటే మెజారిటీ కార్యకర్తలు జనసేనలో చేరాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ రాధా చేరికకు ఒకే చెప్తారా అన్న సందేహం నెలకొంది. కొందరు జనసైనికులు మాత్రం ఇప్పటికే రాధా.. పవన్ తో మాట్లాడారని.. పార్టీలో చేరమని పవన్ ఆహ్వానించారని చెబుతున్నారు. అయితే వంగవీటి రాధా మాత్రం కాంగ్రెస్ ను కూడా ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి రాధా టీడీపీలో చేరతారా..? లేక అందరూ అనుకుంటున్నట్టు జనసేనలో చేరతారా తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories