రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలి: ఎంపీ గీత

రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలి: ఎంపీ గీత
x
ఎంపీ వంగా గీత
Highlights

రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఎంపీ వంగా గీత అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు.

కాకినాడ: రోడ్డు భద్రత అనేది నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఎంపీ వంగా గీత అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఎస్పీఅద్నాన్ నయిమ్ అస్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ అవసరమని, దానిని నిర్లక్ష్యం చేయరాదన్నారు.

ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్యపర్చేందుకేరహదారి భద్రతా వారోత్సవాలునిర్వహిస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రవాణా శాఖ తమ వంతుగా కృషి చేస్తోందన్నారు. దేశంలో సంవత్సరానికి ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, తద్వారా లక్షా 40వేల మంది మృతి చెందుతున్నారన్నారు. మూడున్నర లక్షల మంది క్షతగాత్రులవుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్లే 40 శాతం మంది యువత రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వారు విధిగా తప్పనిసరిగా సీట్ బెల్టు, హెల్మెట్ ధరించాలన్నారు.రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలో కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ప్రమాదాన్ని నివారించేందుకు 'రోడ్డు భద్రతా వారోత్సవాలు' నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ అద్నాన్ నయిమ్ అస్మీ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories