Korukonda: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా వంశీ

Korukonda: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా వంశీ
x
Sodadasi Vamsi
Highlights

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా సోడదాసి వంశీని కిరణ్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

కోరుకొండ: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా సోడదాసి వంశీని కిరణ్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో వంశీ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. పార్టీలో చురుకైన పాత్ర పోషించే వంశీ కి గుర్తింపు లభించింది. వంశి తండ్రి లూధర్ ఏపీ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. వంశీ తల్లి గతంలో సీతానగరం జెడ్పీటీసీ గా పనిచేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఆంధ్ర ప్రదేశ్ యువజన కాంగ్రెస్ కమిటీ నాయకులకు, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ నాయకులకి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories