చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ వల్లభనేని వంశీ మరో లేఖ

చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలుపుతూ వల్లభనేని వంశీ మరో లేఖ
x
Highlights

గన్నవరం ఎమ్మెల్యే ,టీడీపీ నేత వల్లభనేని వంశీ నిన్న టీడీపీని విడుతున్నట్లు మరియు పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం...

గన్నవరం ఎమ్మెల్యే ,టీడీపీ నేత వల్లభనేని వంశీ నిన్న టీడీపీని విడుతున్నట్లు మరియు పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే... తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకి పంపించారు వంశీ.. అనంతరం వంశీ లేఖపై చంద్రబాబు స్పందించారు.. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఎప్పటికీ అండగా ఉంటామని వంశీకి హామీ ఇచ్చారు చంద్రబాబు. తన లేఖపై స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజాగా వంశీ మరో లేఖ రాశారు.

. ''నా ఆవేదనను అర్థం చేసుకొని లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందుంచాను. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా, మీ మార్గదర్శకంలోనే నడిచాను. మీ ఆదేశానుసారం తొలిసారి విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేశాను. కానీ, ఓడిపోయాను. అలా ఐదేళ్ల విలువైన కాలం వృథా అయ్యిందని ఏనాడు బాధపడలేదు. ఓ సీనియర్‌ నేతపై, ఐపీఎస్‌ అధికారిపై, ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది. అప్రాజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదు. 2019 ఎన్నికల్లో నన్ను ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసు. విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదు. నాకు అండగా ఉంటానన్నందుకు కృతజ్ఞతలు. తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధిదాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నాను " అని చంద్రబాబుకి రెండోసారి లేఖను రాసారు వంశీ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories