వల్లభనేని వంశీ పార్టీ మార్పు ఖాయమేనా ?

వల్లభనేని వంశీ పార్టీ మార్పు ఖాయమేనా ?
x
Highlights

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో భేటీ అయిన కొద్దిసేపటికే వంశీ, ఏపీ సీఎం జగన్ తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. బీజేపీ ఎంపీ సుజనాచౌదరితో భేటీ అయిన కొద్దిసేపటికే వంశీ, ఏపీ సీఎం జగన్ తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంతో భేటీ తర్వాత, వంశీ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమనే వాదనలు ఊపందుకున్నాయి.

నిత్యం ఏదో ఒక సంచలనంతో ఉంటున్న ఏపీ రాజకీయాలు తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టెప్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. వల్లభనేని వంశీ పార్టీ మారుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ను కలువడానికి ముందే బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిశారు వల్లభనేని వంశీ. సుజనాతో కలిసి ఒకే కారులో వెళ్లారు. దీంతో వంశీ టీడీపీ నుండి బయటకు వస్తారన్న చర్చ జరుగుతుండగానే ఏపీ మంత్రులు పేర్ని నాని కొడాలి నాని తో కలిసి వంశీ సడన్ గా సీఎం జగన్ తో కలువడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

బెజవాజ రాజకీయాల్లో వల్లభనేని వంశీ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు. సొంతపార్టీలో దేవినేని ఉమా, నెహ్రూలను విభేదించి స్వతంత్రంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ మొదటి నుంచి ఏపీ సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. 2009లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి లగడపాట రాజగోపాల్ చేతిలో ఓటమి చెందారు. 20014, 2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే బెజవాడలో ఓదార్పు యాత్రకు వచ్చిన జగన్ కు ఎదురుపడి కౌగిలించుకోవడం అప్పట్లో సంచలనం రేకెత్తించారు.

రెండు రోజుల క్రితమే పార్టీ అధినేత చంద్రబాబును వల్లభనేని కలిసి మనస్సులోని మాట చెప్పినట్లు సమాచారం. అయితే ఏ పార్టీ వారయినా వైసీపీలో చేరాలంటే ముందుగా పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ గతంలోనే చెప్పడంతో..ఇప్పటికిప్పుడు రాజీనామా చేయకున్నా వైసీపీకి అనుంబంధ సభ్యుడిగా కొనసాగేందుకు వంశీ రెడీ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

ఇప్పటికప్పుడు పార్టీ మారితే లభించే ప్రాధాన్యతపైనే వల్లభనేని ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ ఎటువైపు అడుగులు వేస్తారో అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories