వైకుంఠ ఏకాదశి...తిరుమలకు ప్రముఖుల రాక

వైకుంఠ ఏకాదశి...తిరుమలకు ప్రముఖుల రాక
x
Highlights

దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో...

దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమలలో కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారు. ఈ సందర్బంగా వీఐపీలు అందరూ వైకుంఠ ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున హైకోర్టు సీజే మహేశ్వరి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్‌కుమార్ యాదవ్,

పినిపే విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతంరెడ్డి, శ్రీ రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇక తెలంగాణ నుంచి వచ్చిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సునీల్, సుమలత, సప్తగిరి శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా మంత్రి కేటీఆర్ దర్శనం సమయంలో తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వెంట వున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories