Vadapalli: కోనసీమ వాడపల్లి వేంకటేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

Vadapalli: కోనసీమ వాడపల్లి వేంకటేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
x

Vadapalli: కోనసీమ వాడపల్లి వేంకటేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

Highlights

27 రోజులకు గానూ రూ.1.59 కోట్ల ఆదాయం శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి,.. ఆలయ హుండీల నుంచి రూ.1.30 కోట్ల ఆదాయం అన్నప్రసాదం హుండీల నుంచి రూ.29 లక్షల ఆదాయం హుండీల్లో 8 దేశాల 35 విదేశీ కరెన్సీ నోట్లు

కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి కోటి 30 లక్షలకు పైగా ఆదాయం లభించింది. అన్న ప్రసాదం హుండీల నుంచి 29 లక్షలకు పైగా ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులుకు గానూ కోటి 59 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 15 గ్రాముల బంగారం, 910 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 8 దేశాలకు చెందిన 35 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపుకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి,అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా జె రామలింగేశ్వరరావు, వైవీవీ సత్యనారాయణ, వెల్ల గ్రూప్ త్రీ దేవాలయాల తదితరులు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది, హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Show Full Article
Print Article
Next Story
More Stories