ప్రవేశాలు ఆన్లైన్ ద్వారానే.. ఏర్పాట్లు చేస్తున్న యూనివర్సిటీలు

ప్రవేశాలు ఆన్లైన్ ద్వారానే.. ఏర్పాట్లు చేస్తున్న యూనివర్సిటీలు
x
Highlights

కరోనా కారణంగా ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులకు రూపకల్పన చేస్తున్న విద్యా సంస్థలు, అడ్మిషన్లు సైతం ఇదే విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

కరోనా కారణంగా ఇప్పటికే ఆన్ లైన్ క్లాసులకు రూపకల్పన చేస్తున్న విద్యా సంస్థలు, అడ్మిషన్లు సైతం ఇదే విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఏ విధంగా వీటిని చేయాలనే దానిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన యూనివర్సిటీలు తమ పరిధిలో ఉన్న కాలేజీల్లో సైతం ఇదే విధానాన్ని అవలంభించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ కారణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ విద్యా సంవత్సరం(2020-21) నుంచి సగం సిలబస్‌ను ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పూర్తి చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. అలాగే ప్రవేశాలను సైతం ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించనున్నాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని 218 కళాశాలల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలని డీన్ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇక డిగ్రీ కాలేజీల వివరాలను ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు వర్సిటీలోని కళాశాలల డీన్ కార్యాలయంలో పరిశీలించనున్నారు. దీనితో కళాశాలల యాజమాన్యాలు కేటగిరీ, యూనివర్సిటీ ఆమోద పత్రాలు, కోర్సులు, వసతి సదుపాయాలు ఇతరత్రా వివరాలకు సంబంధించిన వాటితో హాజరుకావాలని డీన్ రామిరెడ్డి తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories