ఆంధ్రప్రదేశ్‌ లో మరో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ లో మరో ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
x
Highlights

ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 9,29,000 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) సిద్ధమైంది. ఈ మేరకు...

ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని 9,29,000 లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ, పైప్‌లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఎంపిక చేసిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ (సిజిడి) ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (పిఎన్‌జిఆర్‌బి) కు ఉందని ఆయన అన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ హక్కుల కోసం 9వ రౌండ్ వేలంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైపుల గ్యాస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఐఓసిఎల్‌కు హక్కు ఉందని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా, ఐఒసిఎల్ ఇప్పటికే హుక్-అప్ సౌకర్యాలు, సిటీ గ్యాస్ స్టేషన్ ,పైప్డ్ గ్యాస్ నెట్‌వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసినట్టు అని మంత్రి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories