నేడు విజయవాడకు నిర్మలా సీతారామన్‌.. షెడ్యూల్ ఇదే..

నేడు విజయవాడకు నిర్మలా సీతారామన్‌.. షెడ్యూల్ ఇదే..
x
Highlights

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ విజయవాడకు రానున్నారు. ఈ సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.25 నిమిషాలకు..

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ విజయవాడకు రానున్నారు. ఈ సందర్బంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.25 నిమిషాలకు చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తారు.. అక్కడ నుంచి మరో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఆమె చేరుకుంటారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధికారులు ఆమెకు స్వాగతం పలకనున్నారు. అనంతరం గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల, నెక్కలం, గూడవల్లి సర్కిల్ వద్ద వ్యవసాయ క్షేత్రంలోని రైతులను కలిసి వారి సాధక బాధలు తెలుసుకుంటారు.

ఆ తరువాత నేరుగా అతిధి గృహానికి చేరుకొని మధ్యాహ్నం 3.00 గంటలకు కేంద్ర ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆమె పాల్గొనున్నారు. గంటపాటు ఈ కార్యక్రమం సాగనుంది. నాలుగు గంటలకు ది వెన్యూ కన్వెన్షన్ హాలులో వ్యవసాయ బిల్లులపై రైతులు, వ్యవసాయరంగ నిపుణులుతో నిర్వహించే చర్చా కార్యక్రమం లో సీతారామన్‌ పాల్గొననున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, పలువురు బీజేపీ ప్రధాన కార్యదర్శులు, నేతలు హాజరవుతారు. కార్యక్రమం అనంతరం ఆమె ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories