ఏపీ రాజధాని మార్పు వార్తలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన

ఏపీ రాజధాని మార్పు వార్తలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధాని మారుతుందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. రాజధాని మార్పుపై ఎటువంటి నిర్ణయం...

ఆంధ్రప్రదేశ్ రాజధాని మారుతుందని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. రాజధాని మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని.. ఇది కేవలం ప్రచారం మాత్రమేనేని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజధాని అంశం కేంద్రం పరిధిలోకి రాదని కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని విషయంపై మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిగా అమరావతి సురక్షితం కాదన్న శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక వాస్తవమేనని ఇప్పుడు అనిపిస్తోందని అన్నారు. దీనిమీద మరోసారి చర్చించాల్సిన అవసరం ఉంది. అక్కడ వర్షాలు వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయి. దీనికోసం మళ్లీ వేరుగా కాల్వలు తవ్వాలి, డ్యామ్‌లు కట్టాలి. మామూలు ప్రాంతాల్లో నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చయితే... అమరావతిలో రెండు లక్షలు అవుతుంది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతుందని అన్నారు. అమరావతిపై త్వరలోనే మా విధానాన్ని ప్రకటిస్తాం అని బొత్స తెలిపిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories