Union Health Department: ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల: కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

Union Health Department: ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల: కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
x
Highlights

Union Health Department: ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది.

Union Health Department: ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల్లో తగ్గుదల. ఏపీలో కరోనా యాక్టివ్ కేసులలో ప్రతిరోజు 13.7 శాతం తగ్గుతోంది. రోజువారీ కరోనా మరణాల్లో 4.5 శాతం తగ్గుదల ఉందని ఆగస్ట్ 13-19 తేదీల మధ్య 1,12,714 కేసులు ఉంటే, 20-26 తేదీల మధ్య 88,612 కేసులు ఉన్నాయి, ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 2 మధ్య 97,272 కేసులు ఉన్నాయి అని తెలిపింది. దేశం మొత్తం మీద కరోనా మరణాలలో ఏపీలో 6.12 శాతంగా ఉంది. కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నా.. రికవరీ రేట్ లో మాత్రం ఏపీ ముందంజలో ఉందని.. కరోనా మరణాల రేటు ఏపీలో గణనీయంగా తగ్గుతుందని వెల్లడించింది.

ఇక దేశం మొత్తంలో ఐదు రాష్ట్రాలలో 62% కరోనా కేసులు ఉన్నాయి. అయితే, వాటిలో మహారాష్ట్రలో 25%, ఏపీలో 12.64 శాతం, కర్ణాటకలో 11.58 శాతం, ఉత్తరప్రదేశ్ లో 7 శాతం, తమిళనాడులో 6 శాతం కేసులు ఉన్నాయని తెలిపింది. మిగిలిన రాష్ట్రాల్లో 37 శాతం కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుదల 6.9 శాతం గాను.. మరణాల సంఖ్య 37.39 శాతంగా ఉంది. కరోనా మరణాల్లో ప్రతిరోజు ఢిల్లీలో 50 శాతం పెరుగుదల ఉంది. అధిక జనాభా, అత్యధిక పరీక్షల వల్ల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే, కరోనా పరీక్షలు పెరిగిన కొద్దీ, అదే స్థాయిలో రికవరీ రేటు పెరుగుతోంది అని.. యాక్టీవ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య మూడు రెట్లు పైనే నమోదవుతున్నాయి అని తెలిపింది.

అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు సుమారు 3,359 కరోనా కేసులు ఉంటే.. భారత్ లో మాత్రం ఆ సంఖ్య 2,792 కేసులు ఉన్నాయి. అమెరికాలో మాత్రం ప్రతి మిలియన్ కు 18,926 కేసులు నమోదవుతున్నాయి. అంతే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ కు సుమారు 111 మంది చనిపోతుంటే భారత్ లో మాత్రం 49 మంది చనిపోతున్నారు అని.. కరోనాతో అమెరికాలో ప్రతి మిలియన్ కు సుమారు 611 మంది చనిపోతున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories