తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

Ugadi Celebrations At Tirumala
x

తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

Highlights

TTD: ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు

TTD: తిరుమలలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శ్రీవారి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప, విష్వక్సేనుల స్వాములకు విశేష సమర్పణ చేశారు. ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories