YS Jagan: జగన్ ప్ర‌భంజ‌నానికి రెండేళ్లు

Jagan Landslide victory
x

వైఎస్ జ‌గ‌న్( దిహ‌న్స్ ఇండియా)

Highlights

YS Jagan: ఒక్క‌డితో ప్రారంభ‌మైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్ర‌భంజ‌నంలా మారింది.

YS Jagan: ఒక్క‌డితో ప్రారంభ‌మైన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు ప్ర‌భంజ‌నంలా మారింది. మే 23, 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అఖండ విజయం సాధించింది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ప్రజా సంక్షేమ పాలన సాగిస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ రెండేళ్ల పాలనపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి నేటికి రెండేళ్లు..ఏపీలో అఖండ విజయం సాధించిన వైయ‌స్ఆర్‌సీ..ఆ తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీదే ఘనవిజ‌యం..వై‍యస్ జగన్ రెండేళ్ల పాలనలో 95 శాతం హామీలు అమలు..దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌కు గుర్తింపు.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు అయిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోక‌సభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

వైఎస్ జగ‌న్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 95 శాతం నెరవేర్చారు. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక గుండెలాగిన వందలాది కుటుంబాలను ఓదార్చేందుకు ఆయన తనయుడు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ అడ్డుపడింది. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జగన్ వైయస్‌ఆర్‌సీపీ పార్టీని స్థాపించారు.

నాటి టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ 2017 నవంబర్‌ 6న ప్రజా సంకల్పయాత్రను జగన్ చేపట్టారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జనం ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీ గడప వద్దకే మంచి పాలన తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

పాదయాత్రలో కాళ్ళ బొబ్బలు, టీడీపీ వెటకారపు మాటలు, విశాఖలో కత్తి పోట్లు, అధికార పార్టీతో గట్టి పోటీ, అక్రమ ఆస్తుల ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ ధృడ సంకల్పంతో ముందుకుసాగారు జగన్. వైసీపీ అధినేతగా ఎనిమిదేళ్ల ప్రయాణం, ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు రాజీలేని పోరాటం చేశారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఒంటి చేత్తో వైసీపీని గెలిపించిన జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాలనా పగ్గాలు చేపట్టిన ఆరు నెలల్లో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80 శాతం నెరవేర్చారు. మేనిఫెస్టోలోని హామీలే కాదు పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించారు.

అవ్వా తాతల పెన్షన్‌ పెంపు మొదలుకొని ఉద్యోగాల విప్లవం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, వైయస్‌ఆర్‌ రైతు భరోసా, అమ్మ ఒడి, గోరు ముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, మన బడి నాడు-- నేడు, ఆరోగ్య‌శ్రీ‌లో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు, వైయస్‌ఆర్‌ వాహనమిత్ర, వైయ‌స్ఆర్ చేయూత‌, ఆసరా, వై ఎస్ ఆర్ కాపు నేస్థం, వై ఎస్ ఆర్ పింఛను కానుక, పేదలకు ఇంటి స్థలాలు, మత్స్యకారులకు వైయస్‌ఆర్‌ భరోసా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు. ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం కోసం గ్రామ సచివలయాలు ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాలనలో సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారు. సార్వత్రిక ఎన్నికలు జరిగినా తర్వాత ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న సీఎం జగన్ నిజమైన లీడర్ గా ప్రశంసలు అందుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories