ఈనెల 6న వైసీపీలోకి ఇద్దరు టీడీపీ కీలక నేతలు?

ఈనెల 6న వైసీపీలోకి ఇద్దరు టీడీపీ కీలక నేతలు?
x
Highlights

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో జంపింగులు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ, కాంగ్రెస్ నేతల చేరికలతో టీడీపీ ఓవర్లోడ్ అయింది. దాంతో...

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో జంపింగులు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ, కాంగ్రెస్ నేతల చేరికలతో టీడీపీ ఓవర్లోడ్ అయింది. దాంతో వైసీపీ, జనసేన వైపు చూస్తున్నారు నేతలు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు మార్చి 6వ తేదీన వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. వారిలో గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఒంగోలు మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో మాగుంటకు ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీ టిక్కెట్ జగన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఒకవేళ ఆయన నెల్లూరు నుంచి పోటీ చేస్తే. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశముంది. మరోవైపు వైసీపీలోకి రావాలనుకుంటున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తనకు సత్తెనపల్లి అసెంబ్లీ లేదా నరసారావుపేట ఎంపీ టిక్కెట్లలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరుతున్నారు. ఇటు నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు అటు సత్తెనపల్లిలో ఆ పార్టీ అగ్రనేత అంబటి రాంబాబుకు టిక్కెట్లు కన్ఫామ్ చేశారు జగన్. ఈ క్రమంలో మోదుగుల ఒకవేళ పార్టీలోకి వస్తే టిక్కెట్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories