అధికార వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు

అధికార వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
x
Highlights

కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో ఈ రోజు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఓ వైసీపీ వర్గం, మరో వర్గం పై దాడి దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. రెండు...

కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రామంలో ఈ రోజు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఓ వైసీపీ వర్గం, మరో వర్గం పై దాడి దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. రెండు వర్గాలు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. గ్రామస్తులు నాలుగు రోజుల నుండి తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. మోటారు స్టార్టర్ ఆర్డర్ లేకుండా పోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది. ఈ విషయాన్ని జిల్లా పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రామస్తులు నీటి సరఫరా కోసం మోటారు స్టార్టర్‌ను రిపేర్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. వైసీపీ నాయకులు,

భాస్కర్ అతని సోదరుడు అతని స్నేహితులు కొందరు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు గురించి తెలుసుకొని ఫిర్యాదుదారుడి ఇంటికి చేరుకున్నారు. కర్రలు మరియు రాళ్ళతో దాడి చేశారు. ఫిర్యాదుదారుడిపై కోపంగా అరుస్తూ భాస్కర్, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి మీకు ఎంత దైర్యం అంటూ ఊగిపోయాడు. ఈ సమయంలో వచ్చిన మరికొందరిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు వచ్చి వారిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. దాడితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories