Coronavirus: మాచర్లలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Coronavirus: మాచర్లలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
x
Coronavirus
Highlights

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది.

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 6.62 లక్షల కరోనా కేసులు నమోదవగా.. 31 వేల మంది ఈ మహమ్మారి దాటిన మృత్యువాత పడ్డారు. ఈ కోవిడ్ తెలుగు రాష్ట్రాల నుంచి సైతం గడగడ వణికిస్తోంది. శనివారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కేసులు 19కి చేరాయి.

గుంటూరు జిల్లాలో మాచర్లలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మాచర్లకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒకే కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వ్యక్తులు మార్చి 17న ఢిల్లీలోని జమత కి వెళ్ళిన వచ్చారు. ఈ ఎనిమిది మందిలో ఇద్దరికి కరోనా రావడంతో ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మిగిలిన వారికి క్వారంటైంన్ కి వచ్చేదిలేదని మొండికేస్తున్నారు.దీంతో కృష్ణా జిల్లాలో 4, విశాఖపట్నంలో 4, గుంటూరులో 4 , ప్రకాశంలో 3, కర్నూలులో 1 నెల్లూరు , రాజమండ్రి ,తిరుపతి లో ఒక్కొక్కటిగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో 19 కరోనా కేసులు చేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories