తాడేపల్లిలో టెన్షన్ పెట్టిన చిన్నారులు

తాడేపల్లిలో టెన్షన్ పెట్టిన చిన్నారులు
x
Highlights

పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి పెద్దలను టెన్షన్ పెట్టిస్తుంటాయి. సరదా కోసం వాళ్లు చేసే కోతి పనులు తల్లిదండ్రులనే కాదు, అందరినీ ఉరుకులు పరుగులు...

పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి పెద్దలను టెన్షన్ పెట్టిస్తుంటాయి. సరదా కోసం వాళ్లు చేసే కోతి పనులు తల్లిదండ్రులనే కాదు, అందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటాయి. ఏపీ రాజధాని ప్రాంతంలో అదే జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయారు. వెళ్లడమైతే వెళ్లారు గానీ, బయటికి రాలేక ఏడవడం ప్రారంభించారు. ఇంకేముంది, ఉరుకులు పరుగులు పెట్టడం పెద్దల వంతయ్యింది. వాళ్లను బయటికి తీసేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది.

పిల్లలన్నాక చిలిపి పనులతోపాటు కోతి పనులు కూడా చేస్తుంటారు. అయితే, వాళ్లు చేసే కోతి పనులు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. సరదా కోసం వాళ్లు చేసే పనులు పెద్దలను టెన్షన్ పెడుతుంటాయి. ఇలాంటి హైటెన్షన్ ఇన్సిడెంటే ఏపీ రాజధాని ప్రాంతంలో జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూకలపేట ఉర్దూ పాఠశాలలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ రెండు గోడల మధ్యలోకి వెళ్లారు. వెళ్లడమైతే సులభంగానే వెళ్లారు గానీ, బయటకి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. అయితే, గోడ సందులో నుంచి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నించినా, ఆ చిన్నారుల వల్ల కాలేదు. దాంతో, గోడ సందులోనే ఇరుక్కుపోయి ఎటూ కదల్లేక సతమతమయ్యారు. బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఊపిరిరాడక నరకయాతన పడ్డారు. దాంతో, ఏడవడం, గట్టిగా అరవడం ప్రారంభించారు. చిన్నారుల కేకలను గమనించిన స్థానికులు, స్కూల్ సిబ్బంది వాళ్లను చాకచక్యంగా బయటికి తీశారు. అయితే, రెండు గోడల మధ్యలో నుంచి బయటికి తీసే క్రమంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

అయితే, రెండు గోడల మధ్య ఇరుక్కున్న పిల్లలిద్దరూ నూకలపేట ఉర్దూ స్కూల్‌లో చదువుకునే విద్యార్ధులు కాదని పాఠశాల సిబ్బంది తెలిపారు. దాంతో, పిల్లలను అలా, నిర్లక్ష్యంగా ఎలా వదిలిపెట్టారంటూ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్లు ఎక్కడ ఉన్నారో, ఎలా ఆడుకుంటున్నారో గమనించాలని, లేదంటే ప్రమాదాల బారినపడే ప్రమాదముందని పోలీసులు హెచ్చరించారు. మొత్తానికి, తాడేపల్లి నూకలపేట ఉర్దూ స్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా టెన్షన్ పుట్టించింది. అయితే, పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులతోపాటు అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories