Top
logo

వైసీపీ-టీడీపీ మధ్య ట్వీట్‌ వార్‌

వైసీపీ-టీడీపీ మధ్య ట్వీట్‌ వార్‌
Highlights

ట్విట్టర్‌ వేదికగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పొలిటికల్‌ వార్ జరుగుతోంది. ఎప్పటిలాగే ట్విట్టర్‌...

ట్విట్టర్‌ వేదికగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య పొలిటికల్‌ వార్ జరుగుతోంది. ఎప్పటిలాగే ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు అండ్‌ టీమ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరుగుతుంటే నారా లోకేష్‌ కూడా అందుకు ధీటుగా ట్విట్టర్‌లో కౌంటర్లిస్తున్నారు. నారా లోకేష్‌ ఇవాళ ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి టార్గెట్‌గా ట్విట్టర్లో పంచ్‌ డైలాగ్‌లు పేల్చారు.

సీఎం జగన్ మాటలను గుర్తుచేసిన నారా లోకేష్ దేవుడి స్క్రిప్ట్‌లో ట్విస్ట్‌లూ ఉంటాయి జగన్‌‌ గారూ! అంటూ ట్వీట్‌ చేశారు. దేవుడు స్క్రిప్ట్‌ రాస్తూ పూర్తిగా ముగించలేదని రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే!... దాన్ని మీరు ఫుల్‌స్టాప్‌ అనుకున్నారు అంటూ సెటైర్లు వేశారు. అయితే ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారంటూ సీఎం జగన్ టార్గెట్‌గా ట్వీట్ల వర్షం కురిపించారు నారా లోకేష్‌.

దేవుడు కామా తర్వాత మళ్లీ స్క్రిప్ట్‌ రాయడం మొదలుపెట్టాడంటూ మరో ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లను మీతోనే ఆన్ చేయించాడు అలాగే అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడన్నారు లోకేష్‌. అలాగే భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే మీరు ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియట్‌లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబు గారికి మనసులో కృతజ్ఞతలు చెప్పకో అని స్క్రిప్ట్‌లో మళ్లీ కామా పెట్టాడంటూ సీఎం జగన్‌‌పై సెటైర్లు వేశారు లోకేష్‌.

టీడీపీ హయాంలో విద్యుత్‌ కొనుగోళ్లు అక్రమమని మీరంటే అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడంటూ ఇంకో ట్వీట్‌ చేశారు నారా లోకేష్‌. దేవుడి స్క్రిప్ట్‌లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయన్న లోకేష్‌ నిజాయితీకే సిగ్గుచేటు అన్నవిధంగా అక్రమాస్తుల కేసులో ఏ1 గారు అవినీతిపై కమిటీ వేస్తే ఏ2 గారు విచారణ చేస్తారట! అంటూ ఎగతాళి చేశారు. కలికాలం కాకపోతే అక్రమాల విక్రమార్కులు నీతి నిజాయితీ గురించి మాట్లాడమా!! అంటూ ఎద్దేవా చేశారు.

నారా లోకేష్‌ ట్వీట్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటరిచ్చారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేష్‌ చిటెకెడు మెదడు మరింత చిట్లినట్టుంది అంటూ సెటైర్లు వేశారు. స్థాయిమరిచి చెలరేగుతున్నారంటూ లోకేష్‌‌పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి మీ తండ్రి చీకట్లో చిందబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కొడుకు బెయిల్‌పై ఉన్నారంటూ గుర్తుచేశారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉందంటూ హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

ఒక్కరు కూడా తప్పించుకోలేరు మీ దోపిడీలన్నీ బయటికి వస్తాయంటూ టీడీపీ నేతలకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దోమలు ఆడో మగో తెలుసుకోవడానికి కోటిన్నర నాకేశారన్న విజయసాయి ప్రపంచంలో ఎక్కడైనా దోమల డేటా సేకరించే ప్రయత్నం జరిగిందా? అంటూ ప్రశ్నించారు. దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయ స్వాహా చేయడం మొదటిసారి వింటున్నా! అంటూ విజయసాయిట్వీట్‌ చేశారు.


లైవ్ టీవి


Share it
Top