ట్విట్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

ట్విట్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్
x
Highlights

ట్విట్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ ట్విట్టర్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీకి చెందిన 300 ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల తరుపున పోరాటం చేసే వారిపైచర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. 300 ఖాతాలు తొలగిస్తే లక్షలాది ఖాతలు పుట్టుకొస్తాయి అంటూ వ్యాఖ్యానించారు.. ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయడానికి గల కారణాలేంటో తనకు అర్థం కావడం లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ట్విట్టర్ జనసేన కార్యకర్తలకు ఊరటనిచ్చింది. తొలగించిన జనసేన అకౌంట్లను తిరిగి పునరుద్ధరించింది. ఈ విషయాన్ని జనసేన అధిననేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్విట్టర్ కు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories