RRR Custodial Torture: తులసిబాబు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Tulasibabu Bail Petition Was Dismissed By The AP High Court
x

RRR Custodial Torture: తులసిబాబు బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Highlights

RRR Custodial Torture: తులసిబాబు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

RRR Custodial Torture: తులసిబాబు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తులసీబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఫిబ్రవరి 13న వాదనలు జరిగాయి. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. తులసిబాబు బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.

తులసిబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రఘురామకృష్ణరాజుపై చిత్రహింసల కేసులో తులసిబాబును ఈ ఏడాది జనవరి 09 అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో అప్పట్లో రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్, తులసిబాబును ముఖాముఖి విచారించారు.

రఘురామకృష్ణరాజును 2021 మే 14న ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేారు. ఈ కేసులో విచారణ సమయంలో తనను చిత్రహింసలు పెట్టారని అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేశారు. 2021 మే 14 రాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలు పెట్టారని రఘురామ ఆరోపించారు.ఇదే విషయమై 2024 జులైలో రఘురామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై కేసు నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories