TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. తితిదే పాలకమండలి కీలక నిర్ణయాలివే

TTD YV Subba Reddy Key Comments
x

TTD: ఆనంద నిలయానికి బంగారు తాపడం.. తితిదే పాలకమండలి కీలక నిర్ణయాలివే

Highlights

TTD: భక్తులకు ఇబ్బందుల్లేకుండా... బంగారు తాపడం పనులు

TTD: తిరుమల వెంకన్న ఆనందనిలయానికి బంగారు తాపడం పనులు చేపట్టబోతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. బంగారు తాపడం పనులు 2023 ఫిభ్రవరి 23 తేదీన ప్రారంభించాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆగమ పండితులతో చర్చించి ఆనందనిలయానికి బంగారు తాపడం పనులు చేపడుతున్నామని తెలిపారు. భక్తులు కానుకలరూపంలో సమర్పించిన బంగారాన్ని విమానగోపురానికి తాపడంచేస్తామని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి, పూజా కైంకర్యాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా బాలాలయాన్ని ఏర్పాటుచేసి శాస్త్రోక్తంగా బంగారు తాపడం పనులు జరుగుతాయని తెలిపారు.

నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా భక్తులకు ఇబ్బందుల్లేకుండా ముందస్తుగా టిక్కెట్లను పంపిణీచేయాలని నిర్ణయించామని పాలకమండలి ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు.

శ్రీవాణి ట్రస్టుద్వారా దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించే పనులు త్వరితగతి చేపట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 1450 ఆలయాలకు ప్రతిపాదనలను పరిశీలించిన పాలకమండలి ఆమోదించినప్పటికీ, పనులు చేపట్టడంలో ఆలస్యమైందన్నారు. మరికొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయన్నారు. వీలైనంత త్వరగా శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణపనులను చేపట్టబోతున్నామని పేర్కొన్నారు.

తిరుమల వెంకన్న దర్శన విధానంలో సమయం మార్పు ఇవాళ్టినుంచి ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. పాలకమండలి సమావేశంలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకున్నామన్నా్రు. సామాన్యభక్తులకు ప్రధమ ప్రాధాన్యత నిచ్చేక్రమంలో ప్రతిరోజూ ప్రాత:కాల పూజలు, నైవేద్యం అనంతరం సామాన్యభక్తులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఇన్నాళ్లున్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని 8 గంటలనుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దీంతో క్యూలైన్లో ఉండే భక్తులు ముందుగా దర్శించుకుంటారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories