TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

TTD to Be Released For Sarva Darshan Tickets
x

 తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

Highlights

TTD: సర్వదర్శనం టోకెన్లకు విడుదల చేయనున్న టీటీడీ

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టోకెన్లు ఎప్పటి నుంచి అందిచాలనుకున్నదానిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని స్పష్టత ఇచ్చారు.. ఎప్పటి నుంచి ఎన్ని అందుబాటులో ఉంచాలి అన్నదానిపై నేడో రేపో ప్రకటన చేయనున్నారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులకు వైవీ సుబ్బారెడ్డి సూచనలు చేశారు. కరోనా నిబంధనలు పాటించడంతో పాటు.. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. లేని వారిని అనుమతించ లేమని చెప్పారు.

తమిళనాడులోని పలు నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు‌.చెన్నై, ఊలందూరు పేట, మధురై ప్రాంతాల్లో ఈ యేడాది చివరిలోగా ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. చెన్నైలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు, చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రం, శ్రీవారి ఆలయానికి నూతనంగా స్థానిక సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు వైవీ సుబ్బారెడ్డి

చెన్నై టీ నగర్ లోని శ్రీవారి ఆలయాన్ని మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జమ్ములో 66 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలియజేశారు. మరోవైపు చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్ లో కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యంలో నాలుగు ప్రాంతాల్లో విశ్రాంతి గదులు నిర్మించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఊత్తుకోట, సితమంజేరిలో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories