TTD: శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

TTD Released White Paper on Srivani Trust
x

TTD: శ్రీవాణి ట్రస్ట్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ

Highlights

TTD: దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు శ్రీవాణి ట్రస్ట్‌ ఏర్పాటు

TTD: శ్రీవాణి ట్రస్ట్‌పై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు శ్రీవాణి ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇప్పటి వరకు 70 మంది దళారులను పట్టుకున్నాట్లు తెలిపింది. మరో 214 మందిపై కేసులు నమోదు చేశామని టీటీడీ చైర్మన్ చెప్పారు. 2018లోనే శ్రీవాణి ట్రస్ట్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని... వైసీపీ ప్రభుత్వం వచ్చాక ట్రస్ట్‌ను ప్రారంభించామన్నారు.

ఆలయాల పునఃనిర్మాణానికి ఈ ట్రస్ట్‌ ద్వారా నిధుల కేటాయింపు జరుగుతున్నట్లు తెలిపారు. మే 31,2023 వరకు శ్రీవాణి ట్రస్ట్‌కు 861 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. సేవింగ్స్‌ ఖాతాలో 139 కోట్ల నిధులున్నాయని చెప్పారు. ట్రస్ట్‌కు వచ్చే విరాళాలను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నామని...ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories