మోదీ నియోజకవర్గం వారణాసి తోపాటు జమ్మూలో శ్రీవారి ఆలయాలు

మోదీ నియోజకవర్గం వారణాసి తోపాటు జమ్మూలో శ్రీవారి ఆలయాలు
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి తోపాటు జమ్మూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని తిరుమల తిరుపతి...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి తోపాటు జమ్మూలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆలయ నిర్మాణాన్ని చేపట్టడానికి వారణాసిలో తగిన భూమిని కల్పించాలని టీటీడీ యూపీ ప్రభుత్వానికి లేఖ రాస్తుందని చెప్పారు. జమ్మూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై స్పందిస్తూ.. జమ్మూలో ఆలయం నిర్మించాలని నిర్ణయించి ఆలయానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని ఆ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు.

ముంబైలో ఆలయ నిర్మాణానికి బోర్డు రూ .30 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. తిరుమల ఆలయ గౌరవ ప్రధాన పూజారిగా రమణ దీక్షితులును నియమించడం బోర్డు తీసుకున్న మరో ప్రధాన నిర్ణయం. అయితే ఆయన నియామకంతో ఆలయంలో ప్రస్తుత నలుగురు ప్రధాన పూజారుల స్థానం, వారి విధుల్లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి. రమణ దీక్షితులు రోజువారీ ఆలయ వ్యవహారాలు లేదా ఆచారాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేరని, అయితే వీఐపీల సందర్శనల సమయంలో మాత్రమే ఆయన ఉంటారని పేర్కొన్నారు. బోర్డు తీసుకున్న ఇతర నిర్ణయాలలో వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల ఆలయంలో రెండు రోజుల వైకుంఠ ద్వార దర్శనం పద్ధతిని కొనసాగించడం.

సాధారణ యాత్రికులకు మరింత అధికంగా దర్శనం కల్పించడానికి వీలుగా విఐపిల సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించాలని నిర్ణయించారు. ఇక టీటీడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టాలని ప్రముఖ ఐటి సంస్థలను సంప్రదించిన తరువాత ప్రత్యేక సైబర్ సెల్ ఉండాలని బోర్డు నిర్ణయించింది. టీటీడీపై ప్రతికూల ప్రచారంపై నిఘా ఉంచడానికి డిఎస్పి నేతృత్వంలో ప్రత్యేక 'సైబర్ సెల్' ను ఏర్పాటు చేయాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఈ సెల్.. సోషల్ మీడియాలో అలాగే బయట ఎక్కడైనా తప్పుడు ప్రచారాలపై తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుత కొండమీదకు వెళ్లే ఘాట్ రోడ్డును తీసేసి సిమెంటు రోడ్డును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు బోర్డులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే చెన్నైకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డిని బిఐఆర్ఆర్డి ఆసుపత్రి డైరెక్టర్ గా నియమించడం మరో నిర్ణయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories