టీటీడీ అలర్ట్ : తిరుమలకు వెళ్లే భక్తులకు ఆంక్షలు

టీటీడీ అలర్ట్ :  తిరుమలకు వెళ్లే భక్తులకు ఆంక్షలు
x
Tirumala file Photo
Highlights

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీటీ కొన్ని ఆంక్షలు విధించింది.

తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీటీ కొన్ని ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉండటంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎవరైనా కరోనా వైరస్ (జలుబు, దగ్గు, జ్వరం) లక్షణాలు ఉంటే తిరుమలకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా అనారోగ్యంతో వస్తే వారికి దర్శన భాగ్యం లేకుండా వెనక్కి పంపిచాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

భక్తులకు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తీర్థయాత్రలు తాత్కాలికంగా నిలివేయాలని అధికారులు కోరుతున్నారు. ముందు జాగ్రత్తగా తిరుమలకు వచ్చే భక్తులు మాస్కులు , శానిటైజర్లు తెసుకొని రావాలని సూచిస్తున్నారు. అలాగే చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాన్నారు. కరోనా లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే తిరుపతిలోని స్విమ్స్ తరలించాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీతో అధికంగా ఉండడంతో అధికారులు పలు సూచనలు చేశారు.

శ్రీవారి సన్నిదికి విదేశాలనుంచి భక్తులు వస్తుంటా. తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచనలు పాటించాలని టీటీడీ తెలిపింది. కరోనాకు వ్యాప్తికి చెక్ పెట్టేందుకు కేంద్రం పలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. గుంపులుగా జనాలు ఉండొద్దని అధికారులకు సూచించారు. ఉంటుంది.. కోరోనా వైరస్ రాకుండా ముందస్తు చర్యలను అధికారులు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories