Tirumala: టీటీడీ మరో కీలక నిర్ణయం.. శ్రీవారి ఆలయంలో ఇక పై స్టీల్ హుండీలు

TTD Is Another key Decision
x

Tirumala: టీటీడీ మరో కీలక నిర్ణయం.. శ్రీవారి ఆలయంలో ఇక పై స్టీల్ హుండీలు

Highlights

Tirumala: ట్రాలీల సహాయంతో హుండీలను లారీలలో తరలించనున్న అధికారులు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో స్టీల్ హుండీల ఏర్పాటుకు టీటీడీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోకి 5 అడుగుల స్టీల్ హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలు ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలు, మరికొన్ని ఇత్తడి హుండీలు ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు పొరుగు సేవల ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో ఆలయం నుంచి బయటకు తెస్తున్నారు. అక్కడి నుంచి లారీలోకి ఎక్కించి నూతన పరకామణికి తరలిస్తున్నారు.

ఇటీవల హుండీల తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. హుండీలోకి భక్తులు నగదు వేస్తున్న సమయంలో లోపలకు చేయి పెట్టి చోరీ చేసిన ఘటనలూ ఉన్నాయి. వీటికి తావివ్వకుండా స్టీలు హుండీలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో మూడువైపులా భక్తులు కానుకలు వేసే అవకాశం కల్పించారు. మధ్యలో ఓ ఇనుప చువ్వ ఏర్పాటు చేశారు. వీటిని ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే స్త్రీల హుండీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories