TTD Hundi Collection: భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

TTD Hundi Income Increased | TTD News
x

TTD Hundi Collection: భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

Highlights

TTD Hundi Income: 4 నెలలుగా ప్రతి నెలా రూ. 100 కోట్లకు పైనే

TTD Hundi Collection: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గత నాలుగు నెలలుగా ప్రతినెలా 100 కోట్లకు పైగానే వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా వడ్డీకాసులవాడికి కాసులు భారీగా సమకూరుతున్నాయి. మే నెలలో అత్యధికంగా 129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కోవిడ్‌ కారణంగా గడచిన రెండేళ్లలో భక్తుల్ని పరిమిత సంఖ్యలో అనుమతించడంతో అప్పుడు హుండీ ఆదాయం బాగా తగ్గింది. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో భక్తులను పూర్తి స్థాయిలో అనుమతిస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం బాగా వస్తోంది.

గతంలో ఏడాదికి 1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం వచ్చేది. మే, జూన్‌ నెలల్లో 100 కోట్ల మార్కు దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం 100 కోట్ల లోపే వుండేది. ఇప్పుడు రోజుకు సుమారు 4 కోట్లు వస్తోంది. ఈ ఏడాది మార్చిలో 128 కోట్లు రాగా, ఏప్రిల్లో 127.5 కోట్లు లభించింది. మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా 129.93 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 106 కోట్ల వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 500 కోట్ల ఆదాయం లభించడంతో ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం 1,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories