నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. చర్చించే అంశాలివే..

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. చర్చించే అంశాలివే..
x
Highlights

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రెండో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఉదయం 10 గంటలకు

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రెండో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. కీలక అంశాల తోపాటు ఇటీవల భారీగా బదిలీలు జరిగిన విషయంపై చర్చించనున్నారు. ప్రజా సంబంధాల అధికారిని ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమించే అజెండాకు ఆమోదం తెలుపనుంది. ప్రజా సంబంధాల విభాగంలో పనిచేస్తున్న ఓఎస్డీ జీతం పెంపునకు పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలపనుంది. గతంలో డిప్యూటీ లా ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన వెంకటసుబ్బ నాయుడును ఎస్డీ లా విభాగానికి నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..

ఎస్వీ ఆయుర్వేదిక్‌ కాలేజీలో పీజీ కోర్సులకు, ఎస్టీ రిజర్వేషన్లు కల్పించే అజెండాపై పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు ఉద్యోగులను పే స్కేల్‌ విధానంలో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా విధుల్లోకి తీసుకునే అంశంపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది.. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఖాళీలపై కూడా చర్చించనుంది. ఇక టీటీడీ విద్యాసంస్థల్లో హాస్టల్‌ వసతి నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ప్రతిష్టాత్మక గరుడ వారధిపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories