Tirupati: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం

TTD Governing Body Meeting Today
x
టీటీడీ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Tirupati: సుమారు 80 అంశాలపై చర్చ * 2020-21 బడ్జెట్ సవరణపై ప్రధాన చర్చ

Tirupati: నేడు టీటీడీ పాలకమండలి మండలి భేటీకానుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సభ్యులు సమావేశంకానున్నారు. సుమారు 80 అంశాలపై చర్చించనున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టినా.. కరోనా నేపథ్యంలో కొంతకాలం దర్శనాలు రద్దు కావడంతో పాటు వివిధ ఆదాయ మార్గాలకు గండి పడింది. ఈ క్రమంలో బడ్జెట్ సవరణపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

శ్రీవారి ఆర్జిత సేవల నిర్వహణ, సేవకు భక్తుల అనుమతితో పాటు కల్యాణమస్తు నిర్వహించాల్సిన ప్రదేశాల ఎంపికపై.. పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పౌరోహిత సంఘానికి చెందిన పురోహితులను.. సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతించే అంశంపై కూడా చర్చ జరగనుంది. టీటీడీ డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇచ్చిన కారణంగా యాక్సిస్ బ్యాంకును బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో డిపాజిట్ చేసే అంశంపైనా చర్చ జరగునుంది. వీటితో పాటు టేబుల్ అజెండాగా మరికొన్ని ఆంశాలపైనా చర్చించి, తీర్మానించనున్నారు. తిరుపతిలోని తుమ్మలగుంట వద్దనున్న ఓల్డ్ గ్యాస్ బిల్డింగ్ ను తెలుగు అకాడమీకి మూడేళ్లకు కేటాయించే విషయంపై తీర్మానం చేసే అవకాశం.

హెల్త్ విభాగానికి సంబంధించి ఎనిమిది మంది జూనియర్ వాటర్ ఎనలిస్టులను అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకునే అంశంతోపాటు విజిలెన్స్ విభాగానికి 300 మంది ఎక్స్ సర్వీస్ సిబ్బందిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే విషయంపై తీర్మానం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకే ప్రాంతంలో గదుల కేటాయింపుపైనా చర్చ తిరుమల నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మినెంట్ చేసే అంశంపైనా తీర్మానం. వీటితోపాటు టేబుల్ అజెండాగా మరికొన్ని ఆంశాలపైనా చర్చించి, తీర్మానించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories