టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్‌

టీటీడీ నకిలీ ఉద్యోగాల ముఠా ఆరెస్ట్‌
x
Highlights

టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ.. భారీగా వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి టీచర్స్ కాలనీకి చెందిన మహేష్.. లుక్‌ మీ...

టీటీడీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ.. భారీగా వసూళ్లకు పాల్పడిన కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి టీచర్స్ కాలనీకి చెందిన మహేష్.. లుక్‌ మీ మ్యాన్‌పవర్ పేరుతో టీటీడీ లడ్డూ కౌంటర్‌ ఏజెన్సీని తీసుకున్నాడు. ఆ పనేదో సక్రమంగా చేసుకోకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురుద్దేశ్యంతో తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. టీటీడీకి చెందిన లడ్డూ కౌంటర్లతోపాటు, అన్నప్రసాదం కేంద్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు.

దాంతో కొందరు నిరుద్యోగులు ఈ ముఠాకు భారీగా డబ్బు ముట్టజెప్పారు. తీరా డబ్బు చెల్లించి రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు మాత్రం రాలేదు. దాంతో కొందరు యువకులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో నలుగురిని అరెస్ట్ చేశారు..అయితే ప్రధాన నిందితుడు మహేష్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.. అతడిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు పోలీసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories