టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి..

టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి..
x
Highlights

టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి.. టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి.. టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి..

2004 నుంచి 2018 వరుకు టీటీడీకి ఏపీ ప్రభుత్వం బకాయి పడ్డ 5 లక్షల పదివేల రూపాయలను ఏపీ ప్రభుత్వం చెల్లించింది. 2004 నుంచి పట్టు వస్త్రాల బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఈ బకాయిలను చెల్లించింది ప్రభుత్వం. ఈమేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్రహ్మోత్సవాలకు తీసుకొచ్చే పట్టు వస్త్రాల బిల్లులను గత ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉంచామని తాజాగా వాటిని క్లియర్ చేశామని పేర్కొన్నారు.

మరోవైపు 2019 వార్షిక బ్రహ్మోత్సవాలకు రూ.70వేలతో శ్రీవారికి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాన్ని సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కూడా ప్రభుత్వం తరుపున టీటీడీకి రూ.70వేలు అందజేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే వైఎస్ కుటుంబానికి అరుదైన అవకాశం లభించినట్లయింది. తండ్రీకొడుకులు ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ నెల 30 నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయి అక్టోబరు 9 వరకు కొనసాగనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories