శ్రీవారి భూములు వేలంపై టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి భూములు వేలంపై టీటీడీ కీలక నిర్ణయం
x
Highlights

ఏపీలో తిరుమలేశుని ఆస్తుల వేలం అంశం పెద్ద తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో తిరుమలేశుని ఆస్తుల వేలం అంశం పెద్ద తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం చేసింది. గురువారం వీడియో సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు నిరుపయోగంగా పడివున్న శ్రీవారి ఆస్తులు, స్థలాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

ప్రత్యేక కమిటీలో పాలకమండలి సభ్యులు, మఠాధిపతులు, స్వామిజీలు, భక్తులు సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా గత పాలకమండలి నిర్ణయాలతో తమపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

* టీటీడీ పాలక మండలి తీర్మానంలో పాత అతిధి గృహం పునరుద్ధరణకు పారదర్శకంగా డొనేషన్ విధానంలో పునర్నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది.

*టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్వహణకు పాలకమండలి ఆమోదం

*కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం లాక్ డౌన్‌లో సడలింపు ఇచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు తీసుకొని తిరుమలలో భక్తుల దర్శనాన్ని పునఃప్రారంభం

ఈ సందర్భంగా శ్రీవారి దర్శనాలకు భక్తుల అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్స్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పలు దేవాలయాల్లో తీర్ధ ప్రసాదాలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories