కరోనాపై టీటీడీ కీలక నిర్ణయం..ఆలయ చరిత్రలో తొలిసారి ప్రత్యేక పూజలు రద్దు

కరోనాపై టీటీడీ కీలక నిర్ణయం..ఆలయ చరిత్రలో తొలిసారి ప్రత్యేక పూజలు రద్దు
x
Tirumala File Photo
Highlights

కరోనా వైరస్ ప్రభావం భగవంతుడిని కూడా వదలలేదు.

కరోనా వైరస్ ప్రభావం భగవంతుడిని కూడా వదలలేదు.ఈ నేపథ్యంలో కోవిడ్ ప్రభావంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని టీటీడీ రద్దు చేసింది. ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజ వాయిదా వేసినట్లు టీటీడీ ప్రకటించింది.

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తం అయ్యింది. టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గంటకు నాలుగు వేల మంది భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతి భక్తుడు టోకెన్‌ తీసుకుని దర్శనం చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది.

సహస్ర్త కళాషాభిషేకం, వసంతోత్సవం, విశేష పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. మార్చి 19 నంచి 21 వరకు శ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహా యాగం నిర్వహించున్నారు. శారద పిఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, మంత్రాలయ పిఠాధిపతి సుబుదేంద్ర స్వామిజీల ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింగాల్ తెలిపారు.

తిరుమలను సెక్టార్ లుగా విభజించి..శుభ్రత చర్యలు చేపట్టారు. గదులు ఖాళీ చేసిన వెంటనే పూర్తిగా శుద్ధి చేసిన తర్వాత మరొకరికి కేటాయిస్తున్నారు. కరోనా అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు పునసమీక్షిస్తున్నారు. తిరుమలలో టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories