ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం!

X
Highlights
ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు సమావేశంకానుంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన దాదాపు 17 మంది సభ్యులు పాల్గొననున్నారు.
admin28 Nov 2020 6:53 AM GMT
ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు సమావేశంకానుంది. ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన దాదాపు 17 మంది సభ్యులు పాల్గొననున్నారు. మిగిలిన వారంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరవుతారు. భేటీలో 107 అంశాలపై చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అన్‌లాక్ గైడ్‌లైన్స్ ప్రకారం.. శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్య పెంపు... డిసెంబర్ 25 వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. ప్రధానంగా శ్రీవారి ఆలయ మహాద్వారం తలుపులు ధ్వజస్తంభ పీఠానికి 6.6 కేజీల బంగారంతో తాపడం పనులు, తిరుమలలోని విశ్రాంతి భవనాల ఆధునికీకరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Web TitleTTD board meeting will be held today at Annamayya Bhavan in Thirumala
Next Story