పేదల ఆకలి తీర్చనున్న తిరుమల వెంకన్న

పేదల ఆకలి తీర్చనున్న తిరుమల వెంకన్న
x
TTD (file photo)
Highlights

ఆకలితో అలమటించే పెదవారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.

ఆకలితో అలమటించే పెదవారికోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో తినడానికి తినడానికి తిండి లేకుండా సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదుతూ చూస్తున్నారు. అలాంటి వారిని ఆడుకోవడానికి టీటీడీ ముందుకు వచ్చింది. ఈ మేరకు 13 కోట్లు రూపాయల నిధులు విడుదల చేసింది.

టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి బోర్డు అధికారులు అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రతి జిల్లాకు 1 కోటి రూపాయలు అందించనుంది. ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేసింట్లు అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories