TTD: రికార్డు సృష్టించిన టీటీడీ వార్షిక బడ్జెట్... ఎంతంటే?

TTD Approves 411 Crores Budget
x

TTD: రికార్డు సృష్టించిన టీటీడీ వార్షిక బడ్జెట్… ఎంతంటే?

Highlights

TTD: రూ.5.25 కోట్లతో 30 అదనపు లడ్డు కౌంటర్లు

TTD: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి వార్షిక బడ్జెట్‌ను విడుదల చేసింది. 2023, 24 ఏడాదికి గాను 4 వేల 411 కోట్లు కేటాయించింది టీటీడీ. భక్తుల సౌకర్యార్థం కొత్తగా 30 లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ. అందుకు బడ్జెట్‌లో 5 కోట్ల 25 లక్షల నిధులు కేటాయించింది. తమిళనాడులోని ఉల్లందురుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనుల కోసం 4 కోట్ల 70 లక్షల రూపాయలు కేటాయించింది. ఇక ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్ కాలేజ్‌లో మూడో అంతస్తు ఏర్పాటు కోసం 4 కోట్ల 78 లక్షలు ఖర్చు చేయనుంది టీటీడీ. ఫిబ్రవరి 17న ఈ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటివరకు బడ్జెట్ వివరాలను విడుదల చేయలేదు. కోడ్ ముగియడంతో ఇవాళ బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories