శభాష్ : చేయిచేయి కలిపారు.. కొండను తవ్వి రోడ్డును వేశారు

శభాష్ : చేయిచేయి కలిపారు.. కొండను తవ్వి రోడ్డును వేశారు
x
Highlights

దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో అడవి బిడ్డల జీవితాలు మాత్రం అలాగే...

దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో అడవి బిడ్డల జీవితాలు మాత్రం అలాగే ఉన్నాయి. కనీస అవసరాలు అయిన రోడ్డు, వైద్య, నీరు, కరెంటు వారికీ ఇప్పటికి సరిగ్గా అందడం లేదు.. ఇక ఇందులో రోడ్ల నిర్మాణం సరిగ్గా లేకా ప్రాణాలు పోయిన సంఖ్య ఎక్కువే.. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా తండాలు, గ్రామాల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది.

మాకు సరైనా రోడ్డు మార్గం కలిపించండని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అధికారుల చూట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. ఇక ఓపిక నశించి ఎవరో వస్తారు ఎదో చేస్తారు అని చూడకుండా మనమే మన పని మొదలుపెడదాం అనుకోని చేయిచేయి కలిపారు.. కొండను తవ్వి రోడ్డును వేశారు. ఇప్పుడు అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు.

తమ రోడ్డు నిర్మాణం కోసం ఒక్కటైనా తొమ్మిది గ్రామాల గిరిజనులు అక్కడ స్థానికంగా దొరికే మెటీరియల్‌తోనే పనిని ప్రారంభించి కేవలం మూడు వారాల్లో ఏడు కిలోమీటర్లు పొడవున కొండను తవ్వి రోడ్డు వేశారు. దీనికోసం 250 కుటుంబాలకు చెందిన 1500 మంది కష్టపడ్డారు. ముందుగా నలుగురికి వచ్చిన ఈ ఆలోచన తొమ్మిది గ్రామాల ప్రజల దృష్టిని ఆకర్షించి ఈరోజు విజయాన్ని సాధించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి అక్కడ మెటల్ రోడ్ వేస్తామని అంటోంది. ఈ సంఘటన చూస్తుంటే మనకి మౌంటెన్‌మెన్‌ దశరథ్‌ మాంఝీ కథ గుర్తుకు రాక మానదు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories