అనంతపురం వద్ద ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు

అనంతపురం వద్ద ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు
x
Highlights

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు శనివారం అర్ధరాత్రి అనంతపురం వద్ద ప్రమాదానికి గురైంది.

బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు శనివారం అర్ధరాత్రి అనంతపురం వద్ద ప్రమాదానికి గురైంది. దాంతో ఓ మహిళ మృతిచెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి ముందు టోల్ గేట్ దగ్గర డ్రైవర్ మరియు క్లీనర్ మధ్య గొడవ జరిగింది. ప్రయాణికులు ఎంత వారిస్తున్నా వారు గొడవపడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అనంతపురం వద్దకు రాగానే బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. డ్రైవర్ మరియు క్లీనర్ మధ్య గొడవ కారణంగా, డ్రైవర్ బస్సును సరిగ్గా నడపలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఆ బస్సు లిమో లైనర్ ట్రావెల్ కు చెందినదిగా గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories