ట్రావెల్ బస్సు లోయలోపడి 9 మంది మృతి

ట్రావెల్ బస్సు లోయలోపడి 9 మంది మృతి
x
Highlights

అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రవేటు ట్రావెల్ బస్ ఈ తెల్లవారుజాములన లోయలో పడి చిత్తూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలకు గురయ్యారు.

పాడేరు: అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఓ ప్రవేటు ట్రావెల్ బస్ ఈ తెల్లవారుజాములన లోయలో పడి చిత్తూరు జిల్లాకు చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా బస్సు భద్రాచలం నుంచి అన్నవరం వెళుతుండగా, చింతూరు - మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో తులసి పాకల గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించారు.


సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిఎం ఆదేశించారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , సత్యకుమార్, కందుల దుర్గేష్,టీజీ భరత్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories