ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ
x
Highlights

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం బుధవారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది....

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం బుధవారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది. హోమ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహ్మద్ హసన్ రజాను జైళ్ల శాఖ డీజీగా బదలీ చేసింది. నెల్లూరు ఎస్పీగా విధుల్లో ఉన్న ఐశ్వర్య రస్తోగిని, డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ విభాగం ఏఐజీగా నియమిస్తూ, భాస్కర్ భూషణ్ ను నెల్లూరు ఎస్పీగా నియమించింది.. విధుల్లో లేని టీఏ త్రిపాఠిని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు పంపింది. కాగా 2000 బ్యాచ్ కి చెందిన మనీశ్ కుమార్ రెండు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ విభాగానికి కుమార్ విశ్వజిత్ ఉన్నారు. ఆయన్ను బుధవారం రిలీవ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories